Online Puja Services

దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?

18.191.202.45

దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ? రాత్రి పూట దీపారాధన వెలిగించి ఉంచొచ్చా ?
- లక్ష్మి రమణ 

నిత్యం దీపారాధన చేసుకోవడం తప్పనిసరి . మన సనాతన ధర్మంలో ఋషులు అగ్నిముఖమైన ఆరాధననే మనకు విహితమైనదిగా తెలియజేశారు . అగ్ని ముఖంగా లేని భగవంతుని ఆరాధన కూడదు, కాబట్టి నిత్యదీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి . దీపారాధన ఇళ్ళల్లో అందరమూ సాధారణంగా చేసుకొనేదే అయినప్పటికీ, చిన్న చిన్న ధర్మ సందేహాలు వెంటాడుతూ ఉంటాయి .  అటువంటివే, దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ? రాత్రి పూట దీపారాధన వెలిగించి ఉంచొచ్చా ? లాండి సందేహాలు కూడా ! 

సాధారణంగా దీపాన్ని ఐదు ముఖాలున్న దీపపు సిమ్మీలలో , లేదా కామాక్షి దీపంలా ఉండే కుందుల్లో , మట్టి ప్రమిదల్లో కూడా చేస్తూ ఉంటాము . ఇలా ఎటువంటి కుందుల్లో దీపాన్ని పెట్టినా కూడా దీపం లో వేసే వత్తులు తూర్పు ముఖంగా వేసుకోవాలి . లేదా ఉత్తర ముఖంగా వేసుకోవచ్చు . తూర్పు ముఖఃముగా దీపాన్ని వెలిగిస్తే - ఆయుష్షు, ఉత్తరముఖంగా వెలిగిస్తే - ధనం లభిస్తాయి . 

ఇలా కాకుండా దక్షిణముఖంగా, పడమర ముఖంగా  దీపారాధన చేయకూడదు.  పడమర ముఖంగా చేసిన దీపారాధన  దుఃఖాన్ని, దక్షిణ ముఖంగా చేసిన దీపారాధన  కీడును కలిగిస్తాయి. 

ఇక , సాయంకాలం వేళ పూజా సమయంలో చేసిన దీపారాధనను రాత్రంతా వెలిగించి ఉంచుకోవచ్చు . 

 రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయా భవేత్ 
యస్య తిష్ఠేత్ గృహే దీపస్తస్య నాస్తి దరిద్రతా || 

సూర్యుడు అస్తమించింది మొదలు మళ్లీ సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి.  అలా దీపం వెలిగే ఇంట్లో దరిద్రం ఉండదు. అని అర్థం . కాబట్టి చక్కగా సాయం కాలం పూజాదికాలు చేసుకొని అప్పుడు చేసిన దీపారాధనని నిస్సంకోచంగా ఉదయం వరకూ వెలుగుతూ ఉండేలా చూడండి . దానివల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది . 

శుభం . 

#dipam #dipararathana #deeparadhana

deeparadhana, deeparathana

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore